Nee prashnalu Song Lyrics

Nee prashnalu Song Details

Movie Name: Kotha Bangaru Lokam(2008)
Starring :  Varun Sandesh, Swetha Basu Prasad, Jaya Sudha, Rao Ramesh,  
Singers :   S.P.Balu
Lyrics : Sirivennela Seetharama shastri
Music : Mickey J Meyer

Nee prashnalu Song Lyrics In Telugu

 

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోసుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటోక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రయాణాలెన్ని
అని తిరిగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాల ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

Nee prashnalu Song Lyrics

Leave a Comment